ఇవాళ డిక్లేర్ చేస్తున్నా.. కచ్చితంగా వంద సీట్లకు పైగా టీఆర్ఎస్ గెలుస్తుంది: సీఎం కేసీఆర్

  • చంద్రబాబు, ఓ మీడియా సంస్థ, కాంగ్రెస్ నేతల కుట్ర
  • రేపో, ఎల్లుండో ఒక డూప్లికేట్ సర్వే వెలువరిస్తారు
  • టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోంది
చంద్రబాబునాయుడు, ఒక మీడియా సంస్థ వాళ్లు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి కుట్ర చేస్తున్నారని, రేపో, ఎల్లుండో ఒక డూప్లికేట్ సర్వే కూడా వెలువరిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ఈ సర్వేలో టీఆర్ఎస్ కు తగినన్ని స్థానాలు రానట్టు చూపిస్తారని విమర్శించారు.

 ‘కేసీఆర్ గా నేను ఇవాళ డిక్లేర్ చేస్తున్నా. కచ్చితంగా వంద సీట్లు పైచిలుకుతో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ తీర్పు అయితే వచ్చిందో.. జంటనగరాల్లో కూడా అదే తీర్పు రిపీట్ కాబోతోంది. ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు’ అని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
TRS
kcr
secunderabad
electiong campaign

More Telugu News